తెలంగాణ

telangana

ETV Bharat / international

నైజీరియా పాఠశాల విద్యార్థులు విడుదల - nigeria school boys released

నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థులను బోకోహారం తీవ్రవాదులు విడుదల చేశారు. విద్యార్థులను భద్రతా దళాలకు అప్పగించారు. వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకుముందు విద్యార్థుల వీడియోను విడుదల చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరవేశారు బోకోహారం తీవ్రవాదులు.

more-than-300-schoolboys-abducted-last-week-by-armed-men-in-north-west-nigeria-have-been-released
నైజీరియా పాఠశాల విద్యార్థులు విడుదల

By

Published : Dec 18, 2020, 5:25 AM IST

నైజీరియాలోని ఓ పాఠశాల నుంచి కిడ్నాప్ చేసిన విద్యార్థులను బోకోహారం తీవ్రవాదులు విడిచిపెట్టారు. 344 మంది విద్యార్థులను భద్రతా బలగాలకు అప్పగించారని కట్సినా రాష్ట్ర గవర్నర్ అమిను బెల్లో మసారి వెల్లడించారు. వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు బోకోహారం తీవ్రవాదులు.. విద్యార్థుల దృశ్యాలతో ఓ వీడియోను విడుదల చేశారు. కొంతమంది పిల్లల ద్వారా తమ డిమాండ్లను చెప్పించారు. సైనిక చర్యలు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బోకోహారం లీడర్ అబుబాకర్ షెకావు ఆదేశాల మేరకే తమను కిడ్నాప్ చేశారని వీడియోలో ఓ విద్యార్థి చెప్పాడు. అపహరణకు గురైనవారిలో కొందరిని చంపేశారని వెల్లడించాడు. కిడ్నాపర్లకు డబ్బులు కావాలని తెలిపాడు. తీవ్రవాదులు విడుదల చేసిన ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

నైజీరియా ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాశ్చాత్య విద్యా విధానాలు నచ్చకే విద్యార్థులను అపహరించినట్లు బోకోహారం చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details