తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇదాయ్ ధాటికి వెయ్యి మంది బలి!

మొజాంబిక్ దేశాన్ని 'ఇదాయ్'​ తుపాను అతలాకుతలం చేసింది. వరదల కారణంగా ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా మరణించారని భావిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

ఇదాయ్

By

Published : Mar 19, 2019, 7:58 AM IST

Updated : Mar 19, 2019, 8:33 PM IST

మొజాంబిక్​లో ఇదాయ్​ తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. నదులు ఉప్పొంగి ఇప్పటివరకువెయ్యికి పైగా ప్రజలు మరణించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉందని పేర్కొన్నారు.

ఇదాయ్ తుపాను బీభత్సం

మొజాంబిక్​లోని ప్రధాన నగరమైన బెరాయ్​లో ఈ నెల 17న వచ్చిన తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మొజాంబిక్​ అనంతరం ఇదాయ్​ ప్రభావం​ పక్క దేశాలైన జింబాంబ్వే, మలావిలకు విస్తరించింది.

"తుపాను ధాటికి మొదట మేం 84 మంది మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించాం. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మృతులు వెయ్యికిపైనే ఉండొచ్చు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇది నిజంగా చాలా ఘోర విపత్తు"

-మొజాంబిక్​ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ.

తుపాను కారణంగా బెరాయ్ నగరానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్​ క్రాస్​ వెల్లడించింది. 90 శాతం నగరం ధ్వంసం అయిందని పేర్కొంది. రోడ్లు, ఇళ్లన్నీ దాదాపు నేలమట్టమయ్యాయని తెలిపింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిరాశ్రయుల్ని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.

Last Updated : Mar 19, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details