పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వెర్డే ద్వీపంలో వందల సంఖ్యలో డాల్ఫిన్లు తీరానికి కొట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు 136 డాల్ఫిన్లు బుల్డోజర్ల సహాయంతో పూడ్చిపెట్టారు అధికారులు. మరో 200కు పైగా డాల్ఫిన్లు బో-విస్తా బీచ్ వద్ద సజీవంగా కనపడ్డాయి. ఈ ఘటనకు కారణం తెలియక స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సజీవంగా ఉన్న డాల్ఫిన్లను తిరిగి సముద్రంలో వదిలినప్పటికీ.. అవి తిరిగి ఒడ్డుకు చేరుతుండటం చూసి నివ్వెరపోతున్నారు.
ఆఫ్రికాలో తీరానికి కొట్టుకొస్తున్న డాల్ఫిన్లు..ఎందుకు? - బో విస్తా
ఆ ద్వీపంలో డాల్ఫిన్లు తీరానికి కొట్టుకొస్తున్నాయి. తిరిగి వాటిని సముద్రంలోకి చేర్చినా మళ్లీ ఒడ్డుకు చేరుతున్నాయి. కొన్నైతే చనిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతోందో అధికారులకూ అర్థం కావట్లేదు. ఆ దేశమేది? అసలు సమస్యేంటి?
![ఆఫ్రికాలో తీరానికి కొట్టుకొస్తున్న డాల్ఫిన్లు..ఎందుకు?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4578459-589-4578459-1569648235500.jpg)
ఆఫ్రికాలో తీరానికి కొట్టుకొస్తున్న డాల్ఫిన్లు..ఎందుకు?
ఆఫ్రికాలో తీరానికి కొట్టుకొస్తున్న డాల్ఫిన్లు..ఎందుకు?
ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి స్పెయిన్ నుంచి నిపుణులను పిలిపించారు కేప్ వర్డే అధికారులు.
Last Updated : Oct 2, 2019, 7:58 AM IST