తెలంగాణ

telangana

ETV Bharat / international

సెల్​ ఫోన్​​ మింగేసిన ఘనుడు.. 6 నెలల తర్వాత!

సాధారణంగా చిన్నపిల్లలు తెలియకుండా.. చిన్న చిన్న వస్తువులను మింగుతుంటారు. కానీ ఇక్కడ అన్నీ తెలిసిన ఒక పెద్ద మనిషి.. ఏకంగా సెల్​ఫోన్​నే (Man swallows phone) మింగేశాడు. మొబైల్ ఫోన్​ను మింగడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ స్టోరీ చదివేయండి మరి.

man swallows phone
ఫోన్​ మింగేసిన ఘనుడు.. 6 నెలల తర్వాత!, ఈజిప్ట్​, ఫోన్​ను మింగి, man swallows phone

By

Published : Oct 22, 2021, 1:55 PM IST

ఇటీవలి కాలంలో కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వారి పొట్టలో నుంచి విచిత్ర‌మైన(Trending news today) వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. రూపాయి నాణేలు, వెంట్రుక‌లు, క‌త్తులు ఇలా చాలానే చూశాం. తాజాగా ఓ వ్యక్తి కడుపులో ఏకంగా మొబైల్​ ఫోన్​నే(Man swallows phone) గుర్తించారు. షాక్​ అవ్వడం వైద్యుల వంతైంది. ఈ విచిత్ర సంఘటన (Trending news today) ఈజిప్ట్​లో జరిగింది.

అసలేమైందంటే..

6 నెలల కిందటే ఆ వ్యక్తి మొబైల్​ ఫోన్​ను మింగాడట. సహజంగా అదే బయటకు వస్తుందని భావించి అలా వదిలేశాడు. అయితే.. మెల్లమెల్లగా కడుపునొప్పి మొదలైంది. తిన్న ఆహారం కూడా జీర్ణమయ్యేది కాదు.

నొప్పి భరించలేక.. ఆస్పత్రికి (Man swallows phone) వెళ్లగా స్కానింగ్​ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. తర్వాత అసలు నిజం తెలుసుకున్నారు. అశ్వాన్​ నగరంలోని.. ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి అతడి కడుపు నుంచి మొబైల్‌ను బయటకు తీశారు. అయితే.. అతని ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం లేదు. పూర్తిగా కోలుకొనే ఉంటాడని వైద్యులు నమ్ముతున్నారు.

బాధితుడు అసలు ఫోన్​ ఎందుకు మింగాడో(Man swallows phone) కూడా తెలియరాలేదు.

ఇవీ చూడండి: కుటుంబాన్ని వదిలి.. మరో మహిళను పెళ్లాడిన తల్లి

ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details