Man Marries Identical Triplets: కాంగోకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి లువిజో.. ఒకేరోజు ఒకేసారి ముగ్గురు కవలలను పెళ్లాడాడు. వైభవంగా జరిగిన ఆ వివాహవేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఇక్కడే మంచి ట్విస్టులున్నాయి కథలో. లువిజో ప్రేమించింది మాత్రం ఒకరినే. చివరికి ముగ్గురిని పెళ్లిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కథ ఇదీ..
లువిజోకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది నటాలీ. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇలా ప్రేమలో ఉన్న ఇరువురూ తరచూ కలుస్తుండేవారు. అప్పుడే తొలి షాక్ తగిలిందతనికి. నటాలీతో పాటు.. అచ్చం ఆమెలానే ఉండే మరో ఇద్దరిని కలిశానన్న విషయం అతడికి తెలిసేందుకు చాలా సమయమే పట్టింది. ఒకేలా ఉన్నారు కాబట్టి.. అతడూ గుర్తించలేకపోయాడు. నటాలీతో పాటు.. నటాషా, నడెగేతో ప్రేమలో పడిపోయాడు. వారంతా ఒకరోజు ఒకేసారి వచ్చి.. ముగ్గురం ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని అసలు విషయం చెప్పారు. ఇది విని లువిజో తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ.. వారి మాటను కాదనలేకపోయాడు.
''అసలు విషయం తెలిసి నేను షాక్ అయ్యా. ముగ్గురూ ఒకేసారి వచ్చినప్పుడు నేను అడిగా 'మీలో నటాలీ ఎవరని?' కానీ వేర్వేరు సందర్భాల్లో వారందరినీ కలిశానని చెప్పారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. నేను నటాలీనే పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ.. ఒక్కరినే పెళ్లి చేసుకొని.. మిగతా ఇద్దరిని వదిలేయలేను.''
- లువిజో
''మేం ముగ్గురం అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పినప్పుడు.. అతడు మొదట షాకయ్యాడు. కానీ.. అప్పటికే మా అందరితో ప్రేమలో పడిపోయినందున మా ప్లాన్ విఫలం కాలేదు. మేం కూడా అతడితో ప్రేమలోనే ఉన్నాం కాబట్టి ఏం కాలేదు.''