తెలంగాణ

telangana

ETV Bharat / international

మాలీలో నరమేధం: 23 మంది ఊచకోత

మాలీలో దారుణం చోటుచేసుకుంది. 23 మందిపై సాయుధకారులు ఆయుధాలతో నరమేధం సృష్టించారు. పులాని, డోగోన్​, బంబార తెగల మధ్య ఘర్ణణలు గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.

మాలీ లో నరమేధం

By

Published : Jul 2, 2019, 7:43 AM IST

పశ్చిమ ఆఫ్రికా సెంట్రల్​ మాలీలోని బిడి, సంకారో,సరన్ గ్రామాలపై దుండగులు దాడి చేశారు. 23 మందిని ఊచకోత కోశారు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో కొంతమంది సాయుధకారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, ప్రజల రక్షణకు భద్రతా సిబ్బంది భరోసానివ్వడం అత్యవసరమని స్థానిక మేయర్​ తెలిపారు.

మరో ఘటనలో కోరో సెంట్రల్ పట్టణం సమీపంలో పేలుడు సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెగల మధ్య ఘర్షణలు...

2015 లో బోధకుడు అమోడౌ కౌఫా నేతృత్వంలో జీహాదీ సమూహం ఉద్భవించినప్పటి నుంచి దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పులాని, డోగోన్​, బంబార తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యలు చోటుచేసుకుంటున్నాయి.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గత మార్చి​లో పులాని తెగకు చెందిన 160 మందిపై ప్రత్యర్ధి సాయుధబలగాలు నరమేధం సృష్టించారు. జూన్​ 17న డోగోన్​ తెగకు చెందిన రెండు గ్రామాల్లోని 41 మంది దారుణ హత్యకు గురయ్యారు.

ఫ్రాన్స్​, ఐక్యరాజ్యసమితి నుండి భద్రతా సహాయం పొందినప్పటికీ... జీహాదీలు మాలీ ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారు.

ఇదీ చూడండి:

అఫ్గానిస్థాన్​లో భారీ పేలుడు- 68 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details