తెలంగాణ

telangana

ETV Bharat / international

మలావీలో వరదల బీభత్సం... 23 మంది మృతి - Malawi

మలావీలోని బ్లాంటైర్​లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. మరో 11 మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు.

మలావీలో వరదల బీభత్సం

By

Published : Mar 9, 2019, 7:40 AM IST

మలావీలోని బ్లాంటైర్​లో వరదలు విధ్వంసం సృష్టించాయి. నీటి ప్రవాహానికి అందులో చిక్కుకొని 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. వరదల బీభత్సానికి దేశవ్యాప్తంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. ములాంజే జిల్లాలో వరద బాధితులకు శిబిరాలను ఏర్పాటు చేశారు. విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో బ్లాంటైర్​ రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

మలావీ రక్షణ అధికారులు, పోలీసులు గల్లంతైన వారి కోసం విస్తృతంగా శోధిస్తున్నారు.

వర్షాలు వచ్చే వారంలోనూ కొనసాగుతాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details