తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్​డౌన్​ వల్ల రోడ్లపైనే కనుకుతీస్తోన్న సింహాల గుంపు - korona virus in india

కరోనా దెబ్బకి జనాలు హడలిపోతున్నారు. వైరస్​ ఎక్కడి నుంచి వచ్చి సోకుతుందో తెలీక గడపదాటే ధైర్యం కూడా చేయట్లేదు. కానీ అడవి రాజులు మాత్రం కొవిడ్​-19 అంటే మాకు లెక్కే లేదంటున్నారు. లాక్​డౌన్​, భౌతిక దూరాల నిబంధనలు మా దగ్గర పనిచేయవంటూ.. దర్జాగా రోడ్ల మీదికి వచ్చేశాయి.

Kruger National Park lions came on roads near Kempiana Contractual Park south africa
మృగరాజులం..లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?

By

Published : Apr 18, 2020, 7:00 AM IST

కరోనా భయంతో జనం ఇళ్ల నుంచి కాలు బయట పెట్టట్లేదు. కానీ, నెమళ్లు, జింకలు, వన్యప్రాణులు మాత్రం ఎంచక్కా రోడ్లపై తిరిగేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కేవలం మనుషులకే.. మాకేం కాదు అన్నట్లు జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో ఉన్న క్రుగెర్‌ నేషనల్‌ పార్క్‌లోని సింహాలు రోడ్లపై సేదతీరుతున్న ఫొటోలను.. అధికారిక ట్విట్టర్​లో షేర్​ చేశారు అధికారులు.

మేం మృగరాజులం.. లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. "సందర్శకులు లేకపోవడం వల్ల క్రుగెర్‌ నేషనల్ పార్క్‌లో ఉన్న కెంపైనా కాంట్రాక్చువల్ పార్క్‌లోని సింహాలు రోడ్లపై సేదతీరుతున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌ వల్ల సింహాలు ఇంత స్వేచ్ఛగా రోడ్లపైకి రావు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉండటం వల్ల వాహనాల రాకపోకలు లేవు. ఈ నేపథ్యంలో ఇలా తమదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాయి’’ అని జూ అధికారులు తెలిపారు.

మేం మృగరాజులం.. లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?

లాక్‌డౌన్ వల్ల వన్య ప్రాణుల ప్రవర్తనలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని పార్క్‌ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలోనూ కాలుష్య స్థాయిలు తగ్గినట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి.

మేం మృగరాజులం.. లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?
మేం మృగరాజులం.. లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?

ఇదీ చదవండి:లాక్​డౌన్​ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details