తెలంగాణ

telangana

ETV Bharat / international

వెంకయ్యకు అత్యున్నత పౌర పురస్కారం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం లభించింది. కొమోరోస్ దేశ అత్యున్నత పురస్కారం 'ది ఆర్డర్​ ఆఫ్​ ది గ్రీన్​ క్రెసెంట్​' పురస్కారంతో వెంకయ్యను సత్కరించారు ఆ దేశ అధ్యక్షుడు అస్సౌమాని. ఉపరాష్ట్రపతి కొమోరోస్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ సహా ఆరు కీలక ఒప్పందాలు జరిగాయి.

By

Published : Oct 11, 2019, 11:41 PM IST

వెంకయ్యనాయుడికి 'ది ఆర్డర్​ ఆఫ్​ ది గ్రీన్ క్రెసెంట్​' పురస్కారం

ఆఫ్రికా ఖండం పరిధిలోని ద్వీపదేశం కొమోరోస్.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 'ది ఆర్డర్​ ఆఫ్ క్రెసెంట్​' పురస్కారాన్ని వెంకయ్యకు అందించారు ఆ దేశ అధ్యక్షుడు అజాలీ అస్సౌమానీ. తనకు కొమోరోస్ పౌర పురస్కారం లభించడంపై ట్వీట్​ చేశారు వెంకయ్య.

"కొమోరోస్ అత్యున్నత పౌర పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్​ ది గ్రీన్​ క్రెసెంట్'ను అధ్యక్షుడు అజాలి మస్సోమాని నాకు ప్రధానం చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను."
- వెంకయ్యనాయుుడు, భారత ఉపరాష్ట్రపతి ట్వీట్​

కీలక ఒప్పందాలు

వెంకయ్యనాయుడు, అస్సౌమాని మధ్య విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, ఆరోగ్యం, సంస్కృతి సహా ఆరు అంశాలపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి.

తక్కువ వ్యవధి దౌత్య, అధికారిక పర్యటనలు జరిపే అధికారులకు వీసా నుంచి మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు.

సముద్రం సాక్షిగా భారత్​, కొమోరోస్​ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం ఇరుదేశాల భద్రతను మరింత పటిష్టం చేస్తుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
వెంకయ్యనాయుడు కొమోరోస్, సియోర్రా లియోన్​ల్లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి.

వెంకయ్యనాయుడు అక్టోబర్ 10 నుంచి 14 వరకు కొమోరోస్, సియెర్రా లియోన్​ దేశాల్లో పర్యటిస్తున్నారు.

ఇదీ చూడండి: తూరుపు తీరంలో కొత్త పొద్దు పొడుస్తుందా..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details