ఆఫ్రికా నైజీరియాలోని కెబ్బి ప్రాంతంలో బందిపోట్లు మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 88మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు.
డంకో-వసాగు ప్రాంతంలోని 8 గ్రామాలపై బందిపోట్లు కాల్పులకు తెగబడ్డారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మొహరించినట్లు పేర్కొన్నారు.