పోలీసులపై ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11మంది పోలీసులు మృతి చెందారు. ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారని, మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఈ అమానుషం జరిగింది. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థా ఇంతవరకు దాడికి బాధ్యత వహించలేదు.
11మంది పోలీసుల కాల్చివేత- 'జిహాదీ'ల పనేనా? - తాలిబన్లు
పోలీసులపై తుపాకీతో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదు. ఐఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఈ అమానుషం జరిగింది.
కాల్చివేత
అయితే ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో అక్కడి ప్రజలపై జిహాదిస్టులు విచక్షణా రహితంగా దాడి చేసి 132 మందిని చంపేశారు.
ఇదీ చదవండి:ఆఫ్రికా దేశంలో పేలుళ్లు- 20 మంది మృతి