తెలంగాణ

telangana

ETV Bharat / international

30 మంది విద్యార్థులను అపహరించిన ఉగ్రవాదులు - students abduction in nigeria

నైజీరియాలో ఓ పాఠశాలపై దాడి చేసి 30మంది విద్యార్థులను ఎత్తికెళ్లారు ఉగ్రవాదులు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు, సిబ్బంది గాయపడ్డారు. అపహరణకు గురైన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Gunmen abduct 30 students from school in northwest Nigeria
30మంది విద్యార్థులను అపహరించిన ఉగ్రవాదులు

By

Published : Mar 12, 2021, 9:11 PM IST

నైజీరియాలో ఓ పాఠశాలపై దాడి చేసి 30 మంది విద్యార్థులను అపహరించారు ముష్కరులు. వారిలో విద్యార్థులు సహా పలువురు సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కదునా రాష్ట్రం ఇగాబిలోని ఫేడరల్​ కాలేజ్​ ఆఫ్​ ఫారెస్టరీ మెకనైజింగ్​ విద్యా సంస్థలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన.

పాఠశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

ముష్కరులతో చర్చలు జరిపి 180 మంది విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా రక్షించామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదుల దాడిలో పలువురు గాయపడినట్లు పేర్కొన్నారు. అదృశ్యమైన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:క్వాడ్ సదస్సుపై తీవ్రంగా స్పందించిన చైనా

ABOUT THE AUTHOR

...view details