తెలంగాణ

telangana

ETV Bharat / international

'పసిడి కొండ'పైకి పారా, పలుగుతో ప్రజల పరుగు - కాంగో కొండల్లో బంగారం నిల్వలు

అత్యంత పేద దేశాల్లో ఒకటైన కాంగోలో బంగారు కొండ ఒకటి బయటపడింది. అది తవ్వుకున్న వాళ్లకి తవ్వుకున్నంత బంగారాన్నిస్తోంది. ముందుగా ఒకరిద్దరికి తెలిసిన ఈ విషయం.. ఆ నోటా ఈ నోటాపడి.. ఆ ప్రాంత వాసులందరికి తెలిసిపోయింది. అంతే.. చేతికందిన వస్తువులతో ఆ బంగారు కొండమీదకి దండెత్తారు. కొండను తవ్వి బంగారాన్ని సొంతం చేసుకుంటున్నారు.

Gold Mine found in Republic of the Congo
కాంగోలో బయటపడిన బంగారు కొండ

By

Published : Mar 7, 2021, 10:17 PM IST

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగోలో ఓ బంగారు కొండ వెలుగుచూసింది. దక్షిణ కివు రాష్ట్రం లుహిహిలో ఉన్న ఆ కొండలోని మట్టిలో 60 నుంచి 90శాతం వరకు పుత్తడి ఉందని కొందరు చెబుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అందిరికీ తెలిసింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు ఆ కొండపైకి ఎగబడ్డారు. గడ్డపారలు ఇతర వస్తువుల సాయంతో నేల నుంచి బంగారాన్ని తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ చేతులతో కూడా మట్టిని తవ్వుతున్నారు. కాంగోలో బంగారు కొండ వెలుగుచూసిందంటూ.. దానికి సంబంధించిన వీడియోను ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ అహ్మద్‌ అల్గోబరి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

ప్రభుత్వం ఆంక్షలు..

ఈ బంగారు కొండను తవ్వుతున్న ప్రజలు.. ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్లి, దాన్ని శుభ్రం చేసి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. బంగారు కొండ బయటపడటం వల్ల.. కాంగో ప్రభుత్వం స్పందించింది. ప్రజలెవరూ ఆ కొండపై బంగారు తవ్వుకోవటానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. కాంగోలో బంగారం ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం దాచిపెట్టి.. అక్కడి స్మగ్లర్లకు సహకరిస్తోందనే ఆరోపణలున్నాయి.

ఇదీ చదవండి:తైవాన్​ మాదే.. అమెరికా జోక్యం అనవసరం: చైనా

ABOUT THE AUTHOR

...view details