తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఉగ్రరూపస్య: రెండు కోట్లు దాటిన కేసులు - కరోనా తాజా వివరాలు

ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆఫ్రికా ఖండంలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. బ్రిటన్​లో కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైంది.

Global COVID-19 tracker
కరోనా ఉగ్రరూపస్య: రెండు కోట్లు దాటిన కేసులు

By

Published : Aug 10, 2020, 10:49 AM IST

ప్రపంచ మానవాళిపై కరోనా ఉగ్రరూపం చూపుతోంది. వైరస్ వ్యాపించిన వారి సంఖ్య తాజాగా రెండు కోట్లకు చేరింది. 7.33 లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 1.29 కోట్లమంది వైరస్​ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 64 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

ఆఫ్రికాలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇందులో సగానికిపైగా ఒక్క దక్షిణాఫ్రికా నుంచే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు మార్క్​ దాటిపోయింది.

బ్రిటన్​లో మరోసారి కరోనా ప్రబలుతోంది. రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య జూన్ నెల తర్వాత తొలిసారి వెయ్యి దాటింది.

అమెరికాలో మరో 47 వేలకుపైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య 52 లక్షలకు ఎగబాకింది. 534 మంది మరణంతో మొత్తం మృతుల సంఖ్య 1,65,617కు చేరింది. మరోవైపు, మెక్సికోలో మరణాల సంఖ్య 50 వేలు దాటింది.

వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 51,99,444 1,65,617
బ్రెజిల్ 30,35,582 1,01,136
రష్యా 8,87,536 14,931
దక్షిణాఫ్రికా 5,59,859 10,408
పెరూ 4,78,024 21,072
మెక్సికో 4,75,902 52,006

ఇదీ చదవండి:మహాత్ముడి కళ్లజోడు వేలం.. ఎంత పలికిందంటే?

ABOUT THE AUTHOR

...view details