పేద దేశాలకు కరోనా టీకా అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన 'కొవాక్స్' కార్యక్రమానికి భారత్ తనవంతు సహకారాన్ని అందించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఉత్పత్తైన టీకాలను పశ్చిమాఫ్రికా దేశమైన 'ఘనా'కు సరఫరా చేసింది.
కొవాక్స్ ద్వారా 'ఘనా'కు భారతీయ టీకాలు
పేద దేశాలకు కరోనా టీకా అందించేందుకు ఐరాస ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రపంచ కూటమి 'కొవాక్స్' ద్వారా టీకాలు అందుకున్న మొదటి దేశంగా ఘనా నిలిచింది. ఈ మేరకు 6 లక్షల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులు భారత్ నుంచి పంపిణీ కావడం విశేషం.
భారత్లో తయారీ 'కొవాక్స్'ను అందుకోనున్న 'ఘనా'
యూనిసెఫ్ ఆధ్వర్యంలో పంపిణీ అయిన ఈ 6 లక్షల టీకాలు బుధవారం తెల్లవారుజామున ఎక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఇదీ చదవండి:ఆఫ్రికాలో లక్ష మార్క్ దాటిన కరోనా మరణాలు