కరుడుగట్టిన ఉగ్రవాది, అల్ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యాడు. నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు అందిన ముందస్తు సమాచారంతో ఫ్రెంచ్ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి.
కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్ మాలిక్ హతం - ఫ్రాన్స్
అల్‌ఖైదా ఉత్తర ఆఫ్రికా అధినేత అబ్దుల్ మాలిక్‌ను హతమార్చినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో అబ్దుల్ తలదాచుకున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపింది.
ఫ్రాన్స్
ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్ మాలిక్ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్ ప్రకటన విడుదల చేసింది. గత ఏడు సంవత్సరాలుగా మాలితోపాటు ఫ్రెంచ్ సైన్యాలు అబ్దుల్ మాలిక్ కోసం గాలిస్తున్నాయి.