ప్రపంచదేశాలన్నీ కరోనావైరస్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మరో మహమ్మారి కోరలు చాస్తోంది. 2018లో ప్రబలిన ఎబోలా వైరస్ ఆఫ్రికాలో మళ్లీ విజృంభిస్తోంది.
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం-నలుగురు మృతి - africa congo ebola latest news
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా కేసులు బయటపడ్డాయి. కాంగోలోని బందక అనే నగరంలో ఆరు కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో నలుగురు మరణించినట్లు వెల్లడించారు.

ఎబోలా
కాంగోకు పశ్చిమాన ఉన్న బందక అనే నగరంలో ఎబోలా కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఆరు కేసులను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'ఆ నిర్ణయాలతో రైతులు, కార్మికుల జీవితాల్లో మార్పు'