తెలంగాణ

telangana

ETV Bharat / international

పాలసీ క్లెయిమ్​ కోసం శవాన్ని బ్యాగ్​లో తీసుకెళ్లిన దృశ్యం

దక్షిణాఫ్రికాలోని ఓ జీవిత బీమా సంస్థ అధికారులకు అనూహ్య ఘటన ఎదురైంది. వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రంలో ఇబ్బందులు తెలెత్తినందున.. పాలసీని క్లెయిమ్​ చేసుకునేందుకు ఏకంగా శవాన్నే కార్యాలయానికి తీసుకెళ్లారు ఓ కుటుంబసభ్యులు. క్వజులు నటాల్​ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.

పాలసీ క్లెయిమ్​ కోసం శవాన్ని బ్యాగ్​లో తీసుకెళ్లిన దృశ్యం

By

Published : Nov 22, 2019, 9:31 AM IST

ఏదైనా జీవిత బీమా సంస్థలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పాలసీ క్లెయిమ్​ చేసుకోవడానికి మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. మరి ఆ సర్టిఫికేట్​లో ఏమైనా ఇబ్బందులు వస్తే.. ఏం చేయాలి? సరిగ్గా ఇదే సమస్య దక్షిణాఫ్రికాలోని ఓ కుటుంబానికి ఎదురైంది. అందుకే వ్యక్తి మరణాన్ని ధ్రువీకరించడానికి ఏకంగా శవాన్నే.. జీవిత బీమా సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లారు ఓ కుటుంబసభ్యులు. ఓ పెద్ద బ్యాగ్​లో మృతదేహాన్ని తీసుకెళ్లి అధికారులకు చూపించి పాలసీని క్లెయిమ్ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

క్వజులు నటాల్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఇదే వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పాలసీ క్లెయిమ్​ కోసం శవాన్ని బ్యాగ్​లో తీసుకెళ్లిన దృశ్యం

ఇదీ చూడండి: మిస్​ వరల్డ్​ ముద్దుగుమ్మల 'ఫొటో' పోజులు

ABOUT THE AUTHOR

...view details