ఆఫ్రికా దేశం నైజర్‌లో జరిగిన రెండు వేర్వేరు దుర్ఘటనల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
పాఠశాలలో అగ్ని ప్రమాదం
దేశంలోనే రెండో అతిపెద్ద నగరం మారాడిలోని ఓ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది పిల్లలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతులంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు చిన్నారులేనని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పాఠశాల గడ్డితో నిర్మించిన పాఠశాలలోని మూడు తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
బంగారు గని కూలి.. 18 మంది మృతి
అదే నగరంలో బంగారు గని కూలి.. 18 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఇటీవల కనుగొన్న బంగారు గని తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వేలాది మంది ఈ గనిలో పని చేయడానికి వెళ్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు చేపడుతున్న స్థానికులు ప్రమాద స్థలాన్ని మారాడి ప్రాంత గవర్నర్ అబువాకర్ చౌబే పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
పని కోసం బంగారు గని వద్దకు చేరుకున్న కార్మికులు ఇదీ చూడండి:అధునాతన ఆయుధ తయారీలో చైనా దూకుడు.. టార్గెట్ అమెరికానే