అల్జీరియా ఔడ్ సౌఫ్లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించగా ఆసుపత్రిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరు చిన్నారులు కాలిన గాయాలతో ప్రాణాలు విడిచారు. మరికొందరు దట్టమైన పొగ మధ్య ఊపిరాడక చనిపోయారు.
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి - Eight babies killed
అల్జీరియాలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
![ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4541119-539-4541119-1569335403181.jpg)
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- 8మంది శిశువులు మృతి
సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. దోమల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరం షార్ట్ సర్క్యూట్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఇదీ చూడండి : 'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్
Last Updated : Oct 1, 2019, 9:18 PM IST