తెలంగాణ

telangana

ETV Bharat / international

పాములతో బాడీ మసాజ్​.. ఆరోగ్యానికి ఎంతో మేలట! - Khairo special news

పామును చూస్తేనే కొందరు భయంతో వణికిపోతారు. అలాంటిది సర్పాలు శరీరంపై, ముఖంపై పాకుతుంటే ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కానీ.. ఈజిప్టులోని ఓ స్పాలో సర్పాలతో చేస్తున్న సరికొత్త మసాజ్‌కు ఆదరణ పెరుగుతోంది. వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తున్న ఈ మసాజ్‌ చేయించుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.

EGYPT SPA OFFERED BODY MESSAGES WITH SNAKES
పాములతో బాడీ మసాజ్​.. ఆరోగ్యానికి ఎంతో మేలట!

By

Published : Jan 3, 2021, 10:56 PM IST

పాములతో బాడీ మసాజ్​.. ఆరోగ్యానికి ఎంతో మేలట!

సర్పాలతో సరికొత్త మసాజ్‌.! ఈ మాట వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ? కానీ.. ఈజిప్టులోని కైరోలో ఓ స్పాలో పాములతో చేస్తున్న మసాజ్‌కు ఆదరణ పెరుగుతోంది. చిన్న సర్పాల నుంచి కొండ చిలువ వరకూ విషంలేని పాములతో ఈ స్పాలో కస్టమర్లకు మసాజ్‌ చేస్తారు. సుమారు 28 రకాల పాములతో ఇక్కడ స్నేక్ మసాజ్‌ చేస్తారు. ఒక్కసారి మసాజ్ బెడ్ మీద పడుకుంటే చాలు.. 30 నిమిషాలు ఆ పాములన్నీ శరీరంపైనే పాకుతూ సుతిమెత్తగా మసాజ్ చేస్తాయి.

ఇవీ ప్రయోజనాలు..

పాములతో మసాజ్‌ చేయడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని స్పా యజమాని సఫ్వాత్ సెడ్కీ వెల్లడించారు. ఈ మసాజ్ వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుందని ఆయన తెలిపారు. స్నేక్‌ మసాజ్‌ ప్రారంభించిన కొత్తలో చాలామంది భయపడేవారని.. ప్రయోజనాలు వివరించిన తర్వాత చాలామంది మసాజ్‌ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని సెడ్కీ చెప్పుకొచ్చారు. స్నేక్‌ మసాజ్‌ వల్ల మానసికంగా శారీరకంగా హాయిగా ఉంటోందని కస్టమర్లు అంటున్నారు.

ఇదీ చూడండి:సౌదీ ఎడారిలో కళ్లు చెదిరే రేస్​

ABOUT THE AUTHOR

...view details