"కాంగోలో 3వేల మందికి పైగా ఎబోలా వైరస్ వ్యాప్తి చెందటం ఆందోళన కలిగించే విషయం. దీనిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు తమ వంతు సహాయం అందించాలి. లేకపోతే మానవాళికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఉత్తర కివు ప్రావిన్స్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 10 వారాలు గమనిస్తే వారానికి సగటున 80 మంది ఎబోలా బారిన పడుతున్నారు. జులై నుంచి కాంగోలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది."
- ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎబోలా ధాటికి రెండువేల మంది బలి
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎబోలా ధాటికి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 2వేల మంది మరణించారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా సోకిన కేసుల సంఖ్య మూడు వేలకు చేరిందని ప్రపంచ ఆరోగ్య నివేదిక తెలిపింది.
ఎబోలా అంటే..
ఎబోలా వైరస్ అడవి జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారి మరణాల రేటు 50 శాతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. 1976లో బెల్జియం మైక్రోబయోలజిస్ట్ పీటర్ పియోట్, అతని బృందం వైరస్‌ను కనుగొన్న ప్రదేశంలో ఎబోలా అనే నది ఉంది. అందువల్ల ఈ వైరస్‌కు ఎబోలా అనే పేరు వచ్చింది. 2013-16 మధ్య కాలంలో ఎబోలా తీవ్రంగా వ్యాప్తి చెందడం వల్ల పశ్చిమ ఆఫ్రికాలో 11 వేల మంది మృత్యువాతపడ్డారు.
ఇదీ చూడండి: మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి విద్యుదాఘాతం