కాంగో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గని కూలిన ఘటనలో 50 మంది మృతిచెందారు. ఈ ఘటన తూర్పున ఉన్న కమితుగ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అక్కడ బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
బంగారం గనిలో ప్రమాదం.. 50 మంది మృతి - congo gold mining
కాంగోలో బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరిపి 50 మంది ప్రాణాలను కోల్పోయారు. తవ్వకాలు చేస్తుండగా గని ఒక్కసారిగా కూలడం వల్ల ఈ ఘటన జరిగింది.
అక్రమంగా బంగారం తవ్వుతున్న 50 మంది బలి!
కాంగోలో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఉన్న కెనడా మైనింగ్ కంపెనీ బన్రో కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ప్రమాదం చోటుచేసుకున్న గని లేదని అధికారులు తెలిపారు. కాంగోలో అక్రమ తవ్వకాలు సర్వసాధారణం. తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.
ఇదీ చదవండి:'ఇట్లు.. మీ అన్నయ్య ప్రధాని నరేంద్ర మోదీ'
Last Updated : Sep 12, 2020, 12:38 PM IST