Desmond tutu funeral: జాతి సమానత్వం, ఎల్జీబీటీల హక్కుల కోసం పోరాడిన కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ మాజీ ఆంగ్లికన్ ఆర్చ్ బిషప్.. డెస్మండ్ టుటు(90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆదివారం ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు విముక్తి కల్పించిన మరో గొప్ప వ్యక్తిని కోల్పోయామన్నారు.
వర్ణ వివక్ష, నల్లజాతీయులపై క్రూరమైన అణచివేత పాలనపై అహింసామార్గంలో అవిశ్రాంత పోరాటం చేశారు డెస్మండ్ టుటు. జోహన్నెస్‌బర్గ్‌లోని చర్చిలో తొలి నల్లజాతి బిషప్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేప్‌టౌన్ ఆర్చ్ బిషప్‌గా సేవలందించారు. వర్ణ వివక్షపై దేశీయంగా, అంతర్జాతీయంగా తన ప్రసంగాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.
1997లో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు టుటు. 2015 నుంచి పలుమార్లు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్ల నివాళి