తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇథియోపియా సాయుధదాడిలో 207కు చేరిన మరణాలు - ఇథియోపియా మానవహక్కుల కమిషన్​

ఇటీవల ఇథియోపియాలో జరిగిన మారణహోమంలో 207మంది మరణించినట్లు ఆ దేశ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.

Death toll in Ethiopia armed attack climbs to 207
ఇథియోపియా:సాయుధదాడిలో 207కు చేరిన మరణాలు

By

Published : Dec 26, 2020, 7:36 PM IST

ఇథియోపియా పశ్చిమ బెనిషాంగుల్​-గుముజ్​ రాష్ట్రంలో జరిగిన సాయుధదాడిలో 207మంది మరణించినట్లు ఇథియోపియా మానవహక్కుల కమిషన్​(ఈహెచ్​ఆర్​సీ)తెలిపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ రక్తపాతంలో 133 మంది మగవారు, 35 మంది మహిళలు, 20మంది వృద్ధులు, మరో 17 మంది చిన్న పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. స్థానికులు నిద్రిస్తున్న సమయంలో ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

గుర్తింపు కార్డులను ఉపయోగించి మృతులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈహెచ్​ఆర్​సీ వివరించింది. చనిపోయిన వారిని గుర్తించి, ఖననం చేసేందుకు స్థానిక అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: ఇథియోపియాలో ఉగ్రదాడి-34మంది మృతి

ABOUT THE AUTHOR

...view details