కరోనా పోరులో భాగంగా భారత్‌కు ఈజిప్ట్ తన వంతు సాయాన్ని అందజేసింది. సుమారు 30టన్నుల వైద్యపరికరాలను భారత్‌కు అందించింది. ఇందులో 300 ప్రాణవాయువు సిలిండర్లు, 50 ఆక్సిజన్ కాన్స్సెన్టేటర్లు, 8 వేల రెమిడెసివిర్ వయల్స్‌ను పంపింది. వీటిని మూడు విమానాల్లో భారత్‌కు పంపింది.
కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలుపుతూ... ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఇల్సిస్ ఆదేశాల మేరకు ఈజిప్ట్ నుంచి 30 టన్నుల వైద్య సహాయ సామాగ్రిని అందించామని ఈజిప్ట్ రాయబార కార్యాలయం తెలిపింది. ఈ సాయం అనేది రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం, విశిష్ట సంబంధానికి గుర్తింపు అని పేర్కొంది.