కరోనా మహమ్మారితో(Corona virus) సతమతవుతున్న ప్రపంచాన్ని ప్రాణాంతక ఎబోలా వైరస్(ebola virus) కలవరపెడుతోంది. కొవిడ్ ఉద్ధృతి సమయంలో.. ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండగా కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టింది. అయితే.. మరోమారు కేసులు నమోదవుతున్నాయి. ఎబోలా ఉద్ధృతికి అడ్డుకట్ట పడిందని ప్రకటించిన ఐదు నెలల తర్వాత తూర్పు కాంగోలో కొత్త కేసు(ebola virus in congo 2021) నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మూడేళ్ల చిన్నారిలో ఎబోలా లక్షణాలు(Ebola virus symptoms ) కనిపించిన క్రమంలో బెనిలోని బట్సిలి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని, అక్టోబర్ 6న ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
" కొవిడ్ సహా ఈ ప్రాంతంలో అంటువ్యాధుల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. అత్యంత సామర్థ్యం కలిగిన టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర నిఘా, సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. కాంగోలో ఎబోలా వైరస్ కట్టడిలో ఉన్న అపార అనుభవం.. కేసులను త్వరగా గుర్తించి వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుంది. "