టాంజానియా మోషి పట్టణంలోని ఓ చర్చిలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా నేలపై పోసిన పవిత్ర తైలాన్ని తాకేందుకు భక్తులు ఎగబడిన నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో 20మంది మరణించగా, 16 మందికి గాయాలయ్యాయని సమచారం. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా కమిషనర్ కిప్పి వారియోబా తెలిపారు.
చర్చిలో తొక్కిసలాట.. 20మంది మృతి - Church service stamped
టాంజానియాలోని ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 20మంది మృతి చెందగా, సుమారు 16మందికి గాయాలైనట్లు సమాచారం. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా కార్యక్రమం నిర్వహించిన బాధ్యులకోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.
మోషి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలకు ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు ఫాదర్ బోనిఫేస్ మ్వాంపోసా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రార్థన సమయంలో పవిత్రతైలాన్ని నేలపై పోశారు నిర్వాహకులు. దీనిని తాకితే అనారోగ్య సమస్యలు నయమవుతాయని భావించిన భక్తులు.. పవిత్ర తైలాన్ని తాకేందుకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 20మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు కారణమైన బోధకుడు మ్వాంపోసా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.