తెలంగాణ

telangana

ETV Bharat / international

పౌరులపై తిరుగుబాటుదారుల దాడి.. 30మంది మృతి - సెంట్రల్ ఆఫ్రికా దాడులు

మధ్య ఆఫ్రికాలో తిరుగుబాటుదారులు ఘోర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు సహా 30 మంది పౌరులు మృతిచెందారు.

africa
ఆఫ్రికా

By

Published : Dec 1, 2021, 5:06 AM IST

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్​ దేశంలో తిరుగుబాటుదారులు భీకర హింసకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు సహా 30 మంది పౌరులు మరణించారు. రాజధాని బాంగూయ్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో కామెరూన్ సరిహద్దుకు సమీపంలో ఈ దాడులు జరిగాయి. కైటా, బేయెన్‌గౌ గ్రామాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో బాంబులతో విరుచుకుపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. దాడులు జరిగిన వెంటనే ప్రాణభయంతో అనేకమంది కామెరూన్‌కు పారిపోయారని గ్బానిన్ అనే ఓ అధికారి వెల్లడించారు.

దేశాధ్యక్షుడు ఫౌస్టిన్ ఆర్చేంజ్ టౌడెరా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు.. తిరిగి ఎన్నిక కాకుండా చూసేందుకు తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. టౌడెరా నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం.. తిరుగుబాటుదారులను సమర్థంగా ఎదుర్కుంటోంది. వారి నియంత్రణలో ఉన్న పట్టణాలను, దేశంలోని మూడింట రెండొంతుల భూభాగాన్ని ప్రభుత్వ దళాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి కూడా.

ఐరాస ప్రకారం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో రెండో అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. 2013 తిరుగుబాటు అనతరం అంతర్యుద్ధంలో మునిగిపోయిందీ ఈ దేశం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details