కెన్యాలో సోమాలియా సరిహద్దుకు సమీపంలోని మందేరా ప్రాంతంలో మందుపాతర(ఐఈడీ) పేలి నలుగురు మృతిచెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. మందేరా సిటీవైపు వెళ్తున్న ఓ బస్సు.. మందుపాతరను దాటడం వల్ల పేలుడు సంభవించినట్లు మందేరా గవర్నర్ అలీ రోబా స్పష్టం చేశారు.
మందుపాతర పేలి నలుగురు మృతి
రోడ్డుపై మందుపాతర పేలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కెన్యాలోని మందేరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మందుపాతర పేలి నలుగురు మృతి
పేలుడు కారణంగా బస్సు పైకప్పు ఎగిరిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే.. ఈ ప్రమాదానికి కారణం అల్ షబాబ్ ఉగ్ర సంస్థ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్ఖైదాతో సత్సంబంధాలున్న ఈ సంస్థ కెన్యాలో పలుమార్లు బాంబు దాడులు చేసింది.
ఇదీ చదవండి:మా టీకా సామర్థ్యం 76 శాతం: ఆస్ట్రాజెనెకా