తెలంగాణ

telangana

ETV Bharat / international

బుర్కినా ఫాసోలో చెలరేగిన హింస.. 19మంది మృతి - బుర్కినా ఫాసోలో ఏ మతం పాటిస్తారు?

బుర్కినా ఫాసోలో చెలరేగిన హింసలో(burkina faso violence) 19 మంది మరణించారు. అయితే ఈ దాడి ముష్కరుల పనేనని ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొంది.

Burkina Faso Attack
బుర్కినాఫాసో

By

Published : Nov 24, 2021, 10:27 AM IST

ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో(burkina faso violence) జరిగిన దాడిలో 19 మంది మరణించారు. వీరిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది సహా.. 10మంది పౌరులు ఉన్నట్లు ప్రభుత్వ మీడియా పేర్కొప్రెస్ ఏజెన్సీ తెలిపింది. సెంటర్ నార్త్ రీజియన్‌లోని ఫౌబ్‌లో జరిగిన ఈ దాడిలో 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్'(doctor without borders) అనే సంస్థ ఆసుపత్రిని ముష్కరులు తగలబెట్టగా.. పలువురు సిబ్బంది గాయపడ్డారు. 'ఈ వార్తతో షాక్ అయ్యాం.. ఈ భీకర పరిస్థితికి ఆందోళన చెందాం' అని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్ హెడ్ మమడౌ డయారా వ్యాఖ్యానించారు.

"ఈ దాడితో ఆరోగ్య కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఇకపై రోగులకు ఇక్కడ చికిత్స అందించలేం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు."

--మమడౌ డయారా, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్

అల్-ఖైదా-ఇస్లామిక్ స్టేట్‌ మధ్య ఘర్షణల కారణంగా బుర్కినా ఫాసోలో రోజురోజుకి హింస(burkina faso attack) పెరుగుతోంది. దీనితో వేలాది మంది అమాయక పౌరులు(burkina faso religion) మరణిస్తున్నారు. 14 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ నెల ఆరంభంలో సహెల్స్ సౌమ్ ప్రావిన్స్‌లో జరిగిన హింసలోనూ 50 మందికి పైగా మరణించారు. అయితే.. ప్రస్తుత భీకరకాండకు వందల కిలోమీటర్ల దూరంలోని 'జెండార్మ్ సైనిక చెక్​పోస్ట్‌' లక్ష్యంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది.

మరోవైపు.. దేశంలోని హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. దేశాధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ రాజీనామా చేయాలనే డిమాండ్​తో నవంబర్ 27న నిరసనలకు పిలుపునిచ్చాయి.

'అధ్యక్షుడు రాజీనామా చేస్తే, మరో వ్యక్తి ఈ సమస్యను పరిష్కరించగలరని భావిస్తున్నాం. ఎందుకంటే అధ్యక్షుడే ప్రధాన సమస్య' సివిల్ సొసైటీ గ్రూప్ అధ్యక్షుడు మమడౌ డ్రాబో స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details