తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఐరోపా​ నుంచే ఒమిక్రాన్​.. నిజం చెప్పడమే మాకు శాపం'

Botswana president omicron: ఒమిక్రాన్​ వేరియంట్ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ.. ఐరోపా నుంచి వచ్చిన నలుగురు రాయబారుల్లోనే మొదట ఈ వేరియంట్​ను గుర్తించామని బోట్స్‌వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి తెలిపారు. ఈ వేరియంట్‌ గురించి తొలుత చెప్పడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

botswana president, omciron botswana
బోట్స్​వానా ఒమిక్రాన్​

By

Published : Dec 4, 2021, 7:40 AM IST

Botswana president omicron: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసినట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో అప్రమత్తమవుతున్న ప్రపంచ దేశాలు దక్షిణాఫ్రికాతో పాటు పలు ఆఫ్రికా దేశాల ప్రయాణాలపై ఆంక్షలు మొదలుపెట్టాయి. వీటిని బోట్స్‌వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వేరియంట్‌ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ.. యూరప్‌ నుంచి వచ్చిన రాయబారుల్లోనే నలుగురిని మొదట పాజిటివ్‌గా గుర్తించామని వెల్లడించారు.

Europe diploamts omicron: "వివిధ దేశాలకు చెందిన రాయబారులు చాలా దేశాల్లో పర్యటించారు. అందులో భాగంగా బోట్స్‌వానాకు వచ్చారు. అందులో నవంబర్‌ 7న వచ్చిన నలుగురిలో ఈ వేరియంట్‌ గుర్తించాం" అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోట్స్‌వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి వెల్లడించారు. వారు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని వెల్లడించేందుకు నిరాకరించిన ఆయన.. యూరప్‌ నుంచి వచ్చిన వారేనా అని అడిగిన ప్రశ్నకు ఔనని సమాధానం ఇచ్చారు.

Omicron botswana: బోట్సోవానాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌.. డెల్టాతో పోలిస్తే భిన్నంగా ఉందని అక్కడి అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అందులోని స్పైక్‌ ప్రొటీన్లలో మ్యుటేషన్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేశారు. వీటిని విశ్లేషించిన డబ్ల్యూహెచ్‌ఓ ఈ కొత్త వేరియంట్‌ను ఆందోళనకర రకంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆఫ్రికా దేశాలపై ఆంక్షలు మొదలుపెట్టాయి. దీన్ని తీవ్రంగా ఖండించిన బోట్స్‌వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి.. అసలు ఈ వేరియంట్‌ గురించి తొలుత చెప్పడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details