తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎండలో హాయ్​ హాయ్​.. బురదలో జాయ్​ జాయ్​ - Baby elephants mud bath viral video

కెన్యాలోని ఓ వైల్డ్​లైఫ్​ ట్రస్ట్​కు చెందిన ఏనుగులు బురదలో సరదాగా జలకాలాడుతున్నాయి. మూడు పిల్ల ఏనుగులు బురదలో స్నానం చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఉల్లాసంగా స్నానం చేస్తున్న ఆ వీడియోను మీరు చూసేయండి.

Baby elephants enjoy bathing in mud in adorable viral video
ఎండలో హాయ్​ హాయ్​.. బురదలో జాయ్​ జాయ్​

By

Published : Jul 26, 2021, 6:03 PM IST

బురదలో కొన్ని పిల్ల ఏనుగులు హాయిగా స్నానం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. 'బురదలో ఆనందం ఇలానే ఉంటుంది' అనే క్యాప్షన్​తో కెన్యాకు చెందిన షెల్డ్రిక్​ వైల్డ్​లైఫ్​ ట్రస్ట్​ ట్విట్టర్​లో ఈ వీడియోను షేర్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

కెన్యాలోని షెల్డ్రిక్​ వైల్డ్​లైఫ్​ ట్రస్ట్​.. అనాథ ఏనుగులను కాపాడడం సహా వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. అందులో ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులకూ ఆ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయమిచ్చింది. షెల్ట్రిక్​ వైల్డ్​లైఫ్​ షేర్​ చేసిన వీడియోలో మూడు పిల్ల ఏనుగులు బురదలో స్నానం చేస్తూ కనపడ్డాయి.

బురద స్నానం మంచిదే..

ఏనుగులకు బురద స్నానం చాలా అవసరం. బురదతో ఏనుగుల చర్మంపై పొర ఏర్పడడం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల నుంచి ఆ పొర కాపాడుతుంది. దీంతో పాటు రకరకాల కీటకాలు కుట్టకుండా రక్షణగా ఉంటుంది. ఏనుగుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలా అవి బురదలో స్నానం చేయడం వల్ల వేసవిలో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండదు.

ఇదీ చూడండి..ఇలా దోశ చేయడం ఎప్పుడూ చూసుండరు!

ABOUT THE AUTHOR

...view details