తెలంగాణ

telangana

ETV Bharat / international

వేర్పాటువాదుల దాడుల్లో 22 మంది మృతి - ఆఫ్రికా వార్తలు

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఇస్లాం​ వేర్పాటువాదులు వరుస దాడులతో విరుచుకుపడ్డారు. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు 22మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు.

Attacks by suspected jihadists
వేర్పాటువాదుల దాడుల్లో 22 మంది మృతి

By

Published : Oct 15, 2020, 6:32 AM IST

Updated : Oct 15, 2020, 7:20 AM IST

వరుస దాడులతో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి ఉలిక్కిపడింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లాం​ వేర్పాటువాదులు ఈ ఘాతుకానికి ఒడికట్టినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

మంగళవారం.. బండియాగారా-బంకాస్​ మధ్య ఓ మిలిటరీ కాన్వాయ్​పై జిహాదీలు జరిపిన దాడిలో 10మంది పౌరులు మరణించారు.

కేంద్ర మాలీలోని సొకౌరాలో అర్ధరాత్రి వేళ సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 9మంది జవాన్లు మృతిచెందారు. మరో ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఆగస్టులో ప్రభుత్వంపై సైనికులు తిరుగుబాటు చేసిన తర్వాత ఇవే అత్యంత భయానకమైన దాడులు.

ఇదీ చదవండి:'వృద్ధులపై కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాన్నిచ్చేనా.?'

Last Updated : Oct 15, 2020, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details