ఆఫ్రికా దేశం మౌరితానియా తీరంలో పడవ మునిగి 58 మంది మరణించారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు మౌరితానియా దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది గాంబియా నుంచి స్పెయిన్కు వెళ్తున్న వలసదారులు ఉన్నట్లు పేర్కొంది.
ప్రమాదంలో 85 మందిని రక్షించగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారలు వెల్లడించారు.
పడవ ప్రమాదంతో చావు అంచుల దాకా వెళ్లొచ్చామని ప్రాణాలతో భయటపడ్డ ఓ ప్రయాణికుడు తెలిపారు.