తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2021, 5:36 AM IST

ETV Bharat / international

దక్షిణ సూడాన్‌లో ఘర్షణలు.. 13మంది మృతి

దక్షిణ సూడాన్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ గొడవల్లో 13 మంది పౌరులు మృతి చెందగా.. మరో 16 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

South Sudan
దక్షిణ సూడాన్‌

దక్షిణ సూడాన్‌లోని లేక్స్ రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణల్లో 13 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. గోనీ, థియెత్ వర్గాల మధ్య మొదలైన ఈ గొడవల కారణంగా తలెత్తిన శాంతిభద్రతల సమస్యను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని మోహరించినట్లు రాష్ట్ర పోలీసు విభాగం తెలిపింది.

"రెండు వర్గాల మధ్య శనివారం ఉదయం ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘటనలో 13 మంది మరణించారు, 16 మంది గాయపడ్డారు. భద్రతా దళాల మోహరింపు అనతరం పరిస్థితిని అదుపులోకి వచ్చింది. ఈ రెండు వర్గాలు దశాబ్ద కాలంగా ఘర్షణ పడుతున్నాయి."

-ఎలిజా మాబోర్ మకువాచ్, పోలీసు అధికార ప్రతినిధి

పశువులపై దాడులు, పగ, పరస్పర హత్యల ద్వారా ఈ రెండు వర్గాలు తరచుగా హింసకు పాల్పడుతుంటాయి. ఇక ఈ ప్రాంతంలో అక్రమ తుపాకులు సమస్య అధికం. తరచూ అమాయక ప్రజలు, సైనికుల ప్రాణనష్టానికి ఇదీ ఓ కారణం. పౌరుల నుంచి ఆయుధాలను దూరం చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

"ఈ ప్రాంత పౌరుల చేతుల్లో ఆయుధాలు ఉండటం ఇక్కడి ప్రధాన సమస్య. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. పశువుల కాపరుల వద్ద సైతం ఆయుధాలు ఉన్నాయి."

-ఎలిజా మాబోర్ మకువాచ్

ఇవీ చదవండి:పాదచారులపై కత్తితో దాడి- ఐదుగురు మృతి!

పేలిన గ్యాస్​ పైపు- 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details