తెలంగాణ

telangana

ETV Bharat / international

రెచ్చిపోయిన బందిపోట్లు- 10 మంది మృతి - bandits attack in nigeria

నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై దాడి చేసి 10 మందిని బలితీసుకున్నారు. అనేక ఇళ్లను ధ్వంసం చేశారు.

bandits attack in nigeria
బందిపోట్లు

By

Published : Nov 6, 2021, 5:40 AM IST

ఆఫ్రికా నైజీరియాలోని కదునా రాష్ట్రంలో బందిపోట్లు శుక్రవారం ఉదయం మారణహోమం సృష్టించారు. రెండు గ్రామాలపై కాల్పులు జరిపి.. 10 మందిని హత్య చేశారు. ఈ ఘటనల్లో అనేక మంది గాయాలపాలయ్యారు.

యాగ్​బాక్​, ఉంగ్వాన్​ రుహుగో గ్రామాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారని కుదునా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అనేక మంది గాయపడ్డారని... పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పింది. ఆయా గ్రామాల్లో భద్రతా దళాలను మోహరించినట్లు పేర్కొంది.

మోటార్​బైక్​ల​పై వచ్చి

మోటార్​బైక్​ల​పై వచ్చిన సాయుధులు ఈ దాడులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారని చెప్పారు. మరోవైపు.. ఈ దాడులపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కుదునా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధితులకు సహాయక సామగ్రిని అందిస్తున్నట్లు చెప్పింది.

నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో కొద్ది నెలలుగా వరుసగా ఇలాంటి సాయుధుల దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో అనేక మంది అపహరణకు, హత్యకు గురవుతున్నారు.

ఇదీ చూడండి:పాక్​లో భారీగా పెరిగిన పెట్రోల్ ధర- అయినా చక్కెరకన్నా చౌకే!

ABOUT THE AUTHOR

...view details