తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా-కెన్యా సంయుక్త సైనిక స్థావరాలపై ఉగ్రదాడి - అమెరికా కెన్యా అల్ షబాబ్

సోమాలియాకు చెందిన అల్​ షబాబ్ ఉగ్ర సంస్థ కెన్యాలోని అమెరికా-కెన్యా సంయుక్త సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది. లాము తీరంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దాడిని దీటుగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేశారు.

Al-Shabaab militants attack US-Kenya military base: govt official
అమెరికా-కెన్యా సంయుక్త సైనిక స్థావరాలపై ఉగ్రదాడి

By

Published : Jan 5, 2020, 12:56 PM IST

Updated : Jan 5, 2020, 5:46 PM IST

అమెరికా-కెన్యా సంయుక్త సైనిక స్థావరాలపై ఉగ్రదాడి

సోమాలియాకు చెందిన జిహాదీ తీవ్రవాదులు కెన్యాలో దాడికి పాల్పడ్డారు. లాము తీరంలోని అమెరికా, కెన్యా సంయుక్త సైనిక స్థావరంపై ముష్కరులు దాడికి పాల్పడినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. సింబా క్యాంప్​ వద్ద తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు తెలిపారు. దాడిని దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.

దాడి చేసింది తామేనని అల్​ షబాబ్ సంస్థ ప్రకటించింది. 'కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనిక స్థావరాన్ని విజయవంతంగా ధ్వంసం చేసి స్థావరంలోని ఓ భాగాన్ని అధీనంలోకి తీసుకున్నాం' అని ఓ ప్రకటనలో తెలిపింది. కెన్యా, అమెరికాకు చెందిన సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.

'అల్​ఖుదూస్​(జేరుసలేం)ను ఎప్పటికీ యూదులుగా మార్చలేరు' అన్న విధానానికి కట్టుబడి ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పేరుతో ఇదివరకే పలు దాడులకు పాల్పడింది అల్​ షబాబ్.

ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల సిరియా యుద్ధంలో అంతులేని నరమేధం

Last Updated : Jan 5, 2020, 5:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details