ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2.43 కోట్ల మందికి వైరస్ సోకగా.. 8.3 లక్షల మంది మృత్యువాత పడ్డారు.
అమెరికా, బ్రెజిల్ వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండగా రష్యాలో స్థిరంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 4,711 మంది వైరస్ సోకగా మొత్తం సంఖ్య 9.7 లక్షలకు చేరింది. 16 వేల మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 441 మంది వైరస్ బారిన పడ్డారు. 14 రోజులుగా ఇదే స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
- పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 445 కేసులు రాగా మొత్తం సంఖ్య 2.94 లక్షలకు చేరింది. వైరస్ ధాటికి ఇప్పటివరకు 6,274 మంది మరణించారు.
- సింగపూర్‌లోనూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 77 కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 56 వేలకు చేరింది.
- ఆఫ్రికాలో సంక్రమణ రేటు 20 శాతం తగ్గినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. మొత్తం 54 దేశాల్లో వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టం చేశారు.