తెలంగాణ

telangana

ETV Bharat / international

సాయుధుల దాడి- 73 మంది విద్యార్థుల కిడ్నాప్! - నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్ కథనాలు ఎందుకు జరుగుతున్నాయి?

ఓ పాఠశాలపై ముష్కరులు దాడి చేసి 73 మంది విద్యార్థులను అపహరించిన ఘటన నైజీరియాలో(Students Kidnapped in Nigeria) జరిగింది. గతంలో ఇదే తరహాలో కిడ్నాప్ అయిన వెయ్యిమంది పిల్లలను విడిపించిన కొద్ది రోజులకే తాజా ఘటన వెలుగుచూడటం గమనార్హం.

నైజీరియా
నైజీరియా

By

Published : Sep 2, 2021, 6:54 AM IST

వాయవ్య నైజీరియాలోని మారుమూల గ్రామం కయాలోని ఓ స్కూలుపై బుధవారం దాడి చేసిన సాయుధులు 73మంది విద్యార్థులను అపహరించినట్టు((Students Kidnapped in Nigeria) పోలీసులు తెలిపారు. ఇటీవలే మూడు బృందాలను కిడ్నాప్ చేసిన దుండగులు భారీమొత్తంలో సొమ్ము రాబట్టి వారిని విడుదల చేశారు. విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికార ప్రతినిధి మహమ్మద్ షేహు తెలిపారు.

ఉత్తర నైజీరియాలో గత డిసెంబరు నుంచి ఇలా దాదాపు వెయ్యి మంది విద్యార్థులను దుండగులు అపహరించి విడిచి పెట్టారు. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది విద్యార్థులు మృతిచెందుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details