లిబియాలో అపహరణకు గురైన ఏడుగురు భారతీయులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని ట్యూనిషియాలోని భారత రాయబారి పునిత్ రాయ్ తెలిపారు.
కిడ్నాపైన ఏడుగురు భారతీయులు విడుదల
సెప్టెంబర్ 14న లిబియాలో అపహరణకు గురైన ఏడుగురు భారతీయులను విడిపించినట్లు ట్యూనిషియాలోని భారత రాయబారి పునిత్ రాయ్ తెలిపారు. వీరు ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు.
అపహరణకు గురైన ఏడుగురు భారతీయులు విడుదల
అశ్వరీఫ్‌లో పనిచేస్తున్న వీరిని సెప్టెంబర్ 14న గుర్తు తెలియని దుండగులు అపహరించారు. సమాచారం తెలుసుకున్న విదేశాంగ శాఖ.. లిబియాలో భారత్‌కు రాయబార కార్యాలయం లేకపోవడం వల్ల ట్యూనిషియాలోని భారత రాయబారికి ఈ సమాచారం అందించింది. అపహరణకు గురైన భారతీయుల సమాచారం కోసం లిబియా ప్రభుత్వాన్ని సంప్రదించగా వారంతా కిడ్నాప్ అయినట్లు తెలిసింది. వారికి ఉపాధి కల్పించిన కాంట్రాక్టర్ సహకారంతో నేరుగా కిడ్నాపర్లతో మాట్లాడి ఏడుగురిని విడిపించినట్లు పునిత్ రాయ్ తెలిపారు.