తెలంగాణ

telangana

ETV Bharat / international

నైజీరియాలో భారత నావికుల అపహరణ - ఎంటీ అపేకస్

నైజీరియాలో ఐదుగురు భారతీయ నావికులను సముద్రపు దొంగలు అపహరించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. వారి విడుదలకు ప్రయత్నాలు ప్రారంభించారు.

సుష్మా స్వరాజ్

By

Published : May 7, 2019, 3:21 PM IST

నైజీరియాలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు భారతీయ నావికులను సముద్రపు దొంగలు అపహరించారు. భారతీయులు ప్రయాణిస్తున్న 'ఎంటీ అపెకస్​​' ఓడనూ వారి అధీనంలోకి తీసుకున్నట్టు సమాచారం.

రెండు వారాలుగా ఆచూకీ లేకుండాపోయిన ఐదుగురు నావికులు అపహరణకు గురయినట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. అపహరణ విషయాన్ని నైజీరియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భారత దౌత్యవేత్త అభయ్​ ఠాకూర్​ను ఆదేశించారు. భారత్​లోని నైజీరియా హైకమిషనర్​కూ సమాచారం అందించారు సుష్మ.

రెండు వారాల క్రితమే..

రెండు వారాల క్రితమే నావికుల ఆచూకీ గల్లంతైందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అపహరణకు గురైన నావికుడు సందీకుమార్​ చౌదరి భార్య భాగ్యశ్రీ దాస్.. సుష్మా స్వరాజ్​కు ట్విట్టర్​ ద్వారా అపహరణ విషయాన్ని తెలిపారు.

ఈ వ్యవహారంపై నైజీరియా నావికాదళం, పోలీసులతో పది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:హెలికాప్టర్ కూలి ఏడుగురు జవాన్లు మృతి

ABOUT THE AUTHOR

...view details