నైజీరియా ఆత్మాహుతి దాడులతో ఉలిక్కిపడింది. ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో జరిగిన పేలుళ్లలో 30 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 40 మంది గాయపడ్డారు. బొకొహరం ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.
నైజీరియాలో ఆత్మాహుతి దాడి- 30 మంది బలి - ప్రాణాలు
నైజీరియాలో మూడు ఆత్మాహుతి దాడులు జరిగాయి. మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. రాజాధాని బోర్నో నగరానికి 38 కి.మీ దూరంలో ముష్కరులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.
నైజీరియాలో ఆత్మాహుతి దాడి- 30 మంది బలి
ఫుట్‌బాల్ అభిమానులు గుంపుగా టీవిలో మ్యాచ్‌ను వీక్షింస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నారు. అత్యవసర సేవల విభాగం సరైన సమయంలో స్పందించక క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రికి చేర్చలేకపోయారు. ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయని బాధితులు వాపోయారు.
ఇదీ చూడండి: రయ్ రయ్: ఆకాశంలో అదిరిపోయే విన్యాసాలు