సూడాన్ రాజధాని ఖ్వార్టమ్‌లోని ఓ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ తయారుచేసే ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు, పొగ ఎగసిపడ్డాయి.
ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలి 23మంది మృతి - sudan fire accident 2019
సూడాన్ రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో 23మంది మరణించారు. 130మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలి 23మంది మృతి
గ్యాస్ ట్యాంకర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన అధికారులు.. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమూ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ పేలుడు ధాటికి పరిశ్రమలో నిలిపి ఉంచిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇదీ చూడండి: రోడ్డుప్రమాదంలో కుటుంబమంతా..!
Last Updated : Dec 4, 2019, 7:13 AM IST