తెలంగాణ

telangana

ETV Bharat / international

బోటు మునిగి 130 మంది మృతి! - లిబియా తీరంలో వలసదారులు

ఆఫ్రికా లిబియా తీరంలో బోటు మునిగింది. ఈ ఘటనలో ఐరోపాకు చెందిన 130 మంది అక్రమ వలసదారులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

boat drowned
మునిగిన బోటు, వలసదారులు మృతి

By

Published : Apr 24, 2021, 7:42 AM IST

ఆఫ్రికాలోని లిబియా తీరం నుంచి ఐరోపాకు అక్రమ వలసదారులను తీసుకువెళుతున్న బోటు మునిగింది. ఈ ఘటనలో 130 మంది మృతిచెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేదరికం భరించలేక ఆఫ్రికా ఖండం నుంచి చాలా మంది మెరుగైన జీవితం కోసం మధ్యధరా సముద్రాన్ని దాటి ఐరోపాలోకి అక్రమంగా చొరబడుతుంటారు. ఇందుకోసం రబ్బరు బోట్లను ఉపయోగిస్తారు. వీటిలో పరిమితికి మించి వలసదారులను ఎక్కిస్తారు.

అలా 130 మందితో బయల్దేరిన బోటు మునిగిపోయింది. బోటు కోసం వెతికామని, తమకున్న పరిమిత వనరుల వలన గుర్తించలేకపోయామని లిబియా అధికారులు తెలిపారు. అయితే.. బోటు మునిగిన ప్రదేశంలో పది మృతదేహాలు కనిపించాయని సహాయకచర్యల్లో పాల్గొన్న ఓ నౌక సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి:సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగునేల గర్వించేలా..

ABOUT THE AUTHOR

...view details