Nigeria Attack News: సెంట్రల్ నైజీరియా జాస్ నగరంలోని జైలుపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా 262 మంది జైలు నుంచి పరారయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది ఖైదీలు, ఒక మిలిటెంట్, ఒక అధికారి ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 'పరారీకి ప్రయత్నించిన ఏడుగురిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి లొంగిపోయాడు' అని అధికారులు వెల్లడించారు.
జైలుపై మిలిటెంట్ల దాడి- 11 మంది మృతి, ఖైదీల పరార్ - ఖైదీల పరారు
నైజీరియాలోని జైలుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 11 మంది (Nigeria Attack News) ప్రాణాలు కోల్పోయారు. 262 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
జైలుపై మిలిటెంట్ల దాడి- 262 మంది ఖైదీల పరారు
నైజీరియాలో ఇదివరకు కూడా మిలిటెంట్లు జైళ్లపై దాడి చేశారు. అక్టోబరు నెలాఖరులో జరిగిన ఈ దాడిలో 800 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
ఇదీ చూడండి :బంగ్లాదేశ్‌పై పట్టుకు చైనా వ్యూహాలు.. ఆయుధాలను ఎరవేసి!