సోమాలియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజధాని మొగధిషులో బీచ్ పక్కన ఉన్న ప్రముఖ ఎలైట్ హోటల్‌పై దాడికి తెగబెడ్డారు. సెక్యూరిటీ గేట్లను బాంబులతో ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. ప్రశాంతంగా బస చేస్తున్న అమాయకులపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సోమాలియా పోలీసులు తెలిపారు. కనీసం 20మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో యువకులు, మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.
హోటల్‌పై ఉగ్రవాదుల దాడి..10 మంది మృతి - లేటెస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్
సోమాలియా రాజధాని మొగదిషులో ప్రముఖ హోటల్‌పై దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 20మందికిపైగా గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. హోటల్ గేట్లను బాంబుతో పేల్చి ముష్కరులు లోనికి చొరబడినట్లు వెల్లడించారు.
హోటల్‌పై ఉగ్రవాదుల దాడి
గత కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న సోమాలియాలో ఈ ఘటనతో మళ్లీ అశాంతి నెలకొంది. హోటల్‌పై దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ అతివాద రెబల్స్, అల్‌ఖైదా అనుబంధ అల్-శబాబ్ ప్రకటించింది.
Last Updated : Aug 17, 2020, 12:05 AM IST