అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడడం వల్ల... తెలంగాణకు చెందిన ఆయన అభిమాని కృష్ణ మనస్తాపంతో మృతి చెందాడు. జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే వాసి కృష్ణ ట్రంప్‌నకు వీరాభిమాని. తన ఇంటి ఆవరణలో ట్రంప్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి.. గత కొంత కాలంగా పూజలు సైతం నిర్వహిస్తున్నాడు. తాజాగా అమెరికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్ సోకగా... తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ... ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశాడు. ట్రంప్ వీరాభిమానిగా ఎంతో గుర్తింపు పొందిన కృష్ణ...ఇవాళ గుండపోటుతో మృతిచెందాడు. కృష్ణ మృతి చెందేముందు తన అభిమాన నేత గురించి పడిన వేదన ఆయన మాటల్లోనే...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీరాభిమానని నేను.. నా దేవుడికి కరోనా వచ్చినందుకు నేనెంతో బాధపడుతున్నాను. నా దేవునికి కరోనా త్వరగా తగ్గిపోవాలని అందరి దేవుళ్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా దేవుడిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.. అందరూ పార్థించాలని కోరుకుంటున్నాను.