తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి రానున్న యోగిఆదిత్యనాథ్​ - యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్​ వార్తలు

బల్దియా ఎన్నికల ప్రచారంలో భాజపా దూసుకెళ్తోంది. జీహెచ్​ఎంసీలో ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ నేతలు.. డివిజన్లను చుట్టేస్తున్నారు. జాతీయ స్థాయి నేతల ప్రచారం.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారం చేయగా.. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రేపు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారానికి రానున్నారు.

up cm yogi adhityanath will campaign in ghmc elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి రానున్న యోగిఆదిత్యనాథ్​

By

Published : Nov 28, 2020, 5:39 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి రానున్న యోగిఆదిత్యనాథ్​

రేపటితో బల్దియా ప్రచారానికి తెర పడనుండటంతో కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గల్లీగల్లీని చుట్టేస్తున్న నేతలు భాజపాను గెలిపించాలని కోరుతున్నారు. ఒక వైపు రాష్ట్ర నేతల ప్రచారం.. మరో వైపు జాతీయ నేతల రాకతో ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐఎస్ సదన్, కుర్మగూడ, అక్బర్ బాగ్, ముసారాంబాగ్ డివిజన్లలో రోడ్ షోల్లో పాల్గొనగా... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడ, గోల్నాక, నల్లకుంట డివిజన్లలో ప్రచారం చేశారు.

అభ్యర్థుల ప్రచారం

కాచిగూడ డివిజన్‌లో భాజపా అభ్యర్థి... ఉమా రమేశ్​ యాదవ్ జోరుగా ప్రచారం నిర్వహించారు. పాతబస్తీ డబీర్‌పురలో ప్రో... నమో వాలంటీర్లు... కులమతాలను కాకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. చిక్కడపల్లి శ్రీ త్యాగరాయగాన సభలో ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు సమావేశానికి... దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. భాజపా గెలిస్తే అరాచకం చోటు చేసుకుంటుందని.. అభివృద్ధి ఉండదని కేటీఆర్​దుష్ప్రచారం చేస్తున్నారని రఘునంనద్‌రావు, స్వామిగౌడ్‌ దుయ్యబట్టారు.

రేపు అమిత్​ షా రాక

ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నేడు హైదరాబాద్‌ రానున్నారు. జీడిమెట్ల నుంచి ఆల్విన్ కాలనీ ఎక్స్ రోడ్డు వరకు రోడ్డు షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. శాలిబండలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రచారానికి చివరి రోజైన రేపు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా

ABOUT THE AUTHOR

...view details