బల్దియా ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల వరకు ప్రచార కార్యక్రమాలు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి ఉండదని తేల్చి చెప్పింది. పోలింగ్ జరిగే 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసే సంప్రదాయాన్ని అందరూ పాటించాలని సూచించింది. వ్యక్తిగత, సభ, సమావేశాలు, ప్రసార మాధ్యమాలు.. ఇలా ఎటువంటి ప్రచారమైన ఆదివారం సాయంత్రం 6 తర్వాత చేసినట్లు రుజువైతే.. అభ్యర్థులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
అభ్యర్థి ఒక వాహనానికి అనుమతి
ప్రచారం నిమిత్తం జీహెచ్ఎంసీ వెలుపల నుంచి వచ్చిన స్థానికేతరులు, నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోవాలని సూచించింది. ఇందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. పోలింగ్ రోజు ఓటింగ్ సరళి పరిశీలించేందుకు అభ్యర్థి ఒక వాహనానికి అనుమతి ఇచ్చింది. వారి ఎన్నికల ఏజెంట్ ఇందులో తిరగవచ్చని వివరించింది. పోటీలో ఉన్న అభ్యర్థి మినహా.. ఇతరులు వాహనం వాడటానికి వీలు లేదని వెల్లడించింది. ఇందుకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు అనుమతి ఇస్తారన్న ఎస్ఈసీ.. వాహనం అద్దంపై ఆ పత్రాన్ని అంటించాలని స్పష్టం చేసింది.
పర్యవేక్షణ బృందాలకు 15 ఫిర్యాదులు